షుగర్ ఉన్నవారు బంగాళదుంప ఎందుకు తినొద్దు.. ?

-

ఆలు అంటే.. చాలు అందరికి రెండుముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఫేవరట్ కర్రీ లిస్ట్ లో బంగాళదుంప కచ్చితంగా ఉంటుంది. అసలు మనం తినాల్సిన కూరగాయలో లిస్ట్ లో బంగాళదుంపది ఆఖరి స్థానం.. కానీ మనం మాత్రం వారానికి ఒక్కసారైనా తింటాం. ఇక రూమ్స్ లో ఉండే వాళ్లైతే.. స్టాక్ తెచ్చిపెట్టకుంటారు. వారానికి నాలుగు రోజులు అయినా తింటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కపూట బంగాళదుంప తిన్నా..ఎఫెక్ట్ పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. అప్పటికప్పుడే.. బాడీ పెయిన్స్, కడుపులో ఆగం ఆగం. షుగర్ ఉన్నవారు బంగాళదుంప తినకూడదు అంటారు. అసలు ఎందుకు తినొద్దు, ఇంకా ఏఏ రోగాలు ఉన్నవారు బంగాళదుంప తినొద్దో చూద్దాం..!

షుగర్: షుగర్ పేషెంట్లు బంగాళదుంపలను అస్సలు తినకూడదు. టైప్ 2 డయాబెటిస్ లేదా హై బ్లడ్ షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలను తినకూడదు అంటారు.. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాని వినియోగం రక్తంలో చక్కెరను అంటే శరీరంలో గ్లూకోజ్ వెంటనే పెంచుతుంది. దీని వల్ల చక్కెర సమస్య పెరిగే ప్రమాదం ఉంది. అందుకే పొరపాటున ఒక్క పూట తిన్నా.. నాలుగు రోజుల వరకూ ఇబ్బందిపడాల్సిందే.

రక్తపోటు- రక్తపోటు ఉన్న రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ బంగాళదుంపలు తినడం వల్ల రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంది.

 

ఎసిడిటీ: బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటే, ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుంది. గ్యాస్ ఏర్పడే సమస్య కూడా వస్తుందట.. కొందరికి కడుపు ఉబ్బరం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా వైద్యులు ఇలాంటి వారిని బంగాళాదుంపలను తినొద్దని చెబుతుంటారు. అయితే.. బంగాళదుంప తినడం వల్లే గ్యాస్ సమస్య వస్తుుందని కాదు.. మీరు వండుకునే విధానం వల్ల ఇది ఎక్కువ అవుతుంది. చింతపండు పులుసుతో గ్రేవీ చేసుకోవడం వల్ల అందులో ఉప్పు, కారం బాగా దట్టించి తయారు చేస్తారు. ఇది ప్రధాన కారణం. ఏ వంటల్లో అయితే.. చింతపండు పులుసు పడుతుందో.. అందులో ఉప్పు ఎక్కువ వేయాలి. ఇక ఆ వంటలు కచ్చితంగా గ్యాస్, కడుపు ఉబ్బరానికే దారితీస్తాయి.

ఊబకాయం- ఊబకాయం సమస్యతో బాధపడే వారికి… బంగాళదుంపలు చాలా హానికరంగా మారతాయి. బంగాళదుంపల్లో పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా బరువు వేగంగా పెరిగుతారు

  1. -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news