ఇంట్లో కూడా మాస్కు ఎందుకు ధరించాలి…?

ఇండియా covid-19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వికె పాల్ ఇంట్లో కూడా మాస్కులు వేసుకుని కరోనా ని బ్రేక్ చేయండి అని అన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి డ్రాప్ లెట్స్, గాలి ద్వారా ఎవరైనా తుమ్మినా, దగ్గినా, మాట్లాడిన, అరిచిన లేదా పాడిన ఇలా నోట్లో నుంచి లేదా ముక్కులో నుంచి వచ్చే డ్రోప్లేట్స్ ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. అలానే చాలా మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా వైరస్ వస్తుంది. దీనితో సులువుగా ఇది తెలియకుండా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.

ఏ లక్షణాలు లేని వాళ్ల ద్వారా కూడా మరొకరికి వ్యాపిస్తుంది అని చెప్పారు. ఈ కారణంగానే మనం చాలా మంది కుటుంబాలు కరోనా బారిన పడుతున్నారు.

ఎందుకు సెకండ్ వేవ్ లో చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు..?

కొంత మందికి తీవ్ర లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్వాస ఆడకపోవడం వంటి కారణాలు దీంతో చాలా మంది ఆసుపత్రి బారిన పడుతున్నారు. మాస్క్ వేసుకోవడం వల్ల covid19 రాకుండా ఉండకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ చేయడం చాలా ముఖ్యం.

నార్త్ కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఆరడుగుల దూరం పాటించినప్పుడు. మాస్కు ధరించినపుడు అంత వేగంగా కరోనా రాదు అని చెప్పడం జరిగింది.

ఇప్పటివరకు ఏ దేశమైనా ఈ నిర్ణయం తీసుకుందా..?

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆరు అడుగుల దూరం పాటించినా కూడా మాస్కు ధరించాలని ముఖ్యంగా ఇంటి లోపల కూడా ధరించాలి అని ఎవరైనా బయట వాళ్ళు వస్తే ముఖ్యంగా ధరించాలని అంది.

ఇలా ఇంట్లో ధరించడం వల్ల రిస్క్ తగ్గుతుంది. ఇంట్లో మాస్కులు ధరించడం వల్ల 79% కరోనా రాకుండా పని చేస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెప్పింది. అయితే కేవలం పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే కాకుండా ఇంట్లో కూడా మాస్కులు ధరించడం వల్ల దీని యొక్క రిస్కు తగ్గుతుంది.