భారత్ కి అండగా ప్రపంచ దేశాలు.. మేమున్నామని భరోసా

కరోనా కోరలు చేస్తున్న వేళ భారత్ కి అనేక దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. మీకు అండగా మేమున్నామంటూ భరోసా నింపుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనాను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు అండగా నిలవగా తాజాగా ఫ్రాన్స్ దేశం కూడా అండగా నిలుస్తూ రెండు వేల మందికి సరిపడా ఆక్సిజన్ పంపుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఎనిమిది ఆక్సిజన్ జనరేటర్లు కూడా పంపుతుంది. ఎనిమిది ఆక్సిజన్ జనరేటర్లు 250 బెడ్ లకు ఏడాది ఎంత ఆక్సిజన్ సరఫరా చేయగలవు.

అలాగే ఈ పరికరాలుతో పాటు 28 వెంటిలేటర్లు కూడా పంపుతున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. మరోపక్క కువైట్ కూడా భారత్ కి ఆక్సిజన్, వైద్య పరికరాలు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా భారత్ కి  వైద్య పరికరాలు, ఆక్సిజన్ పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మన శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ సైతం సాయం చేస్తామని ముందుకు వచ్చింది. భారత్ కు కష్టమొస్తే తామంతా ఉన్నామని ప్రపంచ దేశాలు ముందుకు రావడం కాస్త ఆహ్వానించదగ్గ విషయమే అని అంటున్నారు విశ్లేషకులు.