ఎందుకు బైక్స్‌కు సైలెన్సర్‌ కుడివైపునే ఉంటుంది..?

-

డ్రైవింగ్‌ నేర్చుకునేప్పుడు ఏది ఎక్కడ ఉంటుంది..దేన్ని ఎప్పుడు వాడాలో నేర్చుకుంటాం..కానీ అవి అక్కడే ఎందుకు ఉన్నాయి అని ఎవరూ పెద్దగా ఆలోచించరు. బ్రేక్‌ ఎక్కడ ఉంది..ఎప్పుడు వేయాలి, హారన్‌ ఎక్కడ ఉంది..సిగ్నల్‌ ఎప్పుడు ఇవ్వాలి ఇలానే నేర్చుకుంటారు కానీ అసలు అవి అక్కడే ఎందుకు ఉన్నాయి..అని మనకు పెద్దగా డౌట్ కూడా రాదు..సాధారణంగా అన్ని బైక్స్‌లో సైలెన్సర్‌ కుడివైపునే ఉంటుంది. ఎందుకు ఎడమ పక్క ఉండొచ్చుగా? కుడి పక్కనే ఎందుకు పెడతారో ఈరోజు చూద్దాం..!

నిజానికి కుడి పక్కకి సైలెన్సర్‌ని పెట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఎడమవైపు అందరూ నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సైలెన్సర్ పొగ కానీ సైలెన్సర్ కానీ ప్రమాదంగా మారకూడదని కుడి పక్కన పెడతారు.

అలానే చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు ఒక పక్క కూర్చుంటూ ఉంటారు. అయితే అలా ఎడమపక్క కూర్చున్నప్పుడు సైలెన్సర్ కుడి పక్క ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

అలానే మనం బండి బ్రేక్ వేసి ఆపాలని అనుకున్నప్పుడు జనరల్‌గా ఎడమ పాదం ఫుట్ రెస్ట్ మీదకి ముందు వస్తుంది. దీంతో మనకి సైలెన్సర్ పోగ కానీ వేడిగా తగలడం కానీ జరగదు. అందుకే కుడి వైపుకు సైలెన్సర్‌ ఉంటుంది.

అదే విధంగా ఎడమ వైపు చైన్స్ స్ప్రాకెట్ ఉంటుంది. కుడి పక్కన సైలెన్సర్ పెడితే బరువు బ్యాలెన్స్‌ అవుతుంది. అందుకే సైలెన్సర్ కుడి పక్కకి ఉంటుంది.

అయితే ఎడమ పక్కకు ఉండకూడదు.. కుడి పక్కనే ఉండాలి అని రూల్‌ ఏం లేదు.. ఎందుకంటే స్పోర్ట్స్ బైక్స్‌కి రెండు పక్కల సైలెన్సర్లు ఉంటాయి. అలానే కొన్ని బండ్లకైతే సీట్ కింద కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం కుడి పక్కకు మాత్రమే ఉంటాయి.

సో..ఇది అనమాట బైక్స్‌కు సైలెన్సర్‌ కుడివైపుకు ఉండేదుకు కారణాలు.. సైలెన్సర్‌ ఒక్కటే కాదు.. బైక్‌లో ఉండే ప్రతి పార్ట్‌ మన అవసరాలకు అనుకూలంగానే డిజైన్‌ చేస్తారు. ఆలోచిస్తే అంతా వింతగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news