రోజుకి ఒక పండు ఎందుకు తినాలి..? కారణం ఏమిటి..?

-

ఆరోగ్యం బాగుండాలంటే మంచి డైట్ ని తీసుకుంటూ ఉండాలి. మంచి డైట్ ని తీసుకుంటే ఆరోగ్యంగా ఎంతో బాగుంటుంది చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు అయితే అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన డైట్ ని తప్పక తీసుకోండి. డైట్ లో కూరగాయలు పండ్లు వంటివి తీసుకోవాలి. అయితే పండ్లు తీసుకోమని డాక్టర్లు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకు మనం రోజుకో పండుని డైట్ లో చేర్చుకోవాలి దాని వల్ల లాభం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ అందులో ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఉదర సంబంధిత సమస్యలు వుండవు. అలానే జీర్ణం బాగా అవుతుంది వీటితో పాటుగా కాన్స్టిపేషన్, పైల్స్ వంటి సమస్యలు కూడా రావు. పండ్లు తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చు. రోజుకి ఒక పండు తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది పండ్ల లో విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం కూడా ఉంటుంది రోజుకి ఒక పండు తీసుకుంటే విటమిన్ లోపం ఉండదు. అన్ని రకాల పోషక పదార్థాలు పొందడానికి అవుతుంది.

పండ్ల లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి పండ్లను తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. కిడ్నీ ఆరోగ్యానికి లివర్ ఆరోగ్యానికి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా పండ్లు ఎంతో సహాయపడతాయి. పండ్లు తీసుకుంటే చర్మం జుట్టు కూడా ఎంతో బాగుంటుంది పండ్ల లో ఫ్లెవనాయిడ్స్, పాలిఫైనాల్స్ ఉంటాయి బ్లడ్ సర్కిలేషన్ బాగా అయ్యేటట్టు చేస్తాయి. చర్మం కూడా క్లియర్ గా ఉండేటట్టు పండ్లు సహాయపడతాయి ఇలా పండ్లను తీసుకుంటే ఇన్ని లాభాలని మనం పొందవచ్చు. కాబట్టి రోజుకి ఒక పండుని తీసుకుంటూ ఉండండి అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news