ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ తో భార్యాభర్తలకు నెలకు రూ.10 వేలు….!

-

కేంద్ర ప్రభుత్వం వివిధ స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 2015 మే 9న కోల్‌కతాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. అలానే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన స్కీమ్స్ ని కూడా తీసుకు వచ్చారు.

అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అర్హత వివరాలు:

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళు ఈ స్కీమ్ కి అర్హులు.
పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగ పడుతుంది.
భారతీయ పౌరులెవరైనా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు.
60 ఏళ్లు పూర్తైన వారు ఈ స్కీమ్ కింద నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు హామీ ఇస్తారు.

నెలకు రూ.10 వేల పెన్షన్….

ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చు. 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ తో నెలకు రూ.10 వేల పెన్షన్ పొందొచ్చు. 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు ఈ స్కీమ్ లో పెట్టాల్సి వుంది. ఈ స్కీమ్ లో 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చెయ్యాల్సి వుంది.

ఎలా ఈ స్కీమ్ ని ఓపెన్ చెయ్యచ్చు…

అన్ని జాతీయ బ్యాంకులు లో ఈ స్కీమ్ ని తెరవచ్చు.
బ్యాంకుల వెబ్‌సైట్‌కి వెళ్లి అటల్ పెన్షన్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి.
డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమాచారం ఇవ్వాల్సి వుంది.
ఆధార్ కార్డు ఫోటో కాఫీని కూడా ఇవ్వాలి.
అప్లికేషన్ అప్రూవల్ అయ్యాక కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఎంత పెడితే ఎంత వస్తుంది…?

రూ.1000 పింఛన్ ని కనుక మీరు పొందాలంటే నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చెయ్యాలి. అదే రూ.5 వేలు కావాలంటే రూ. 210 కంట్రిబ్యూట్ చేయాల్సి వుంది. త్రైమాసికంగా రూ. 626, అర్థవార్షికంగా రూ. 1,239 పొందొచ్చు. నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు చెల్లిస్తారు. ఇలా భార్యాభర్తలకు రూ. 10 వేలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news