ఢిల్లీలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ హత్య కేసు ఘటన సృష్టించిన అలజడుల నుంచి బయటపడక ముందే.. ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుమారుడి సాయంతో భర్తను దారుణంగా హత్య చేసిన భార్య.. అతని శరీరాన్ని 22 ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాలలో పడేసింది. జూన్లో జరిగిన ఈ ఘటనను తాజాగా పోలీసులు పరిష్కరించారు. ఈ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “తల్లి పూనమ్, కుమారుడు దీపక్ కలిసి అంజన్ దాస్ ను హత్య చేశారు. మృతదేహాన్ని రాంలీలా మైదాన్, న్యూ అశోక్ నగర్ డ్రైనేజ్, ఖాళీ స్థలాల్లో డెడ్ బాడీ ముక్కలుగా పడేశారు. మృతుడు అంజన్ దాస్ పుర్రెను పాతిపెట్టారు. కుటుంబ కలహాలు హత్యకు కారణం. మే 30వ తేదీన తల్లీ,కొడుకు అంజన్‌కు మద్యం తాగించి అందులో నిద్రమాత్రలు కలిపారు. అంజన్ దాస్ గొంతు కోసి, రక్తం పూర్తిగా పోయేందుకు మృతదేహాన్ని ఒక రోజు ఇంటిలో వదిలేశారు.
అంజన్ దాస్ శరీరాన్ని 10 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో పడేశారు. డెడ్ బాడీకి సంబంధించిన 6 ముక్కలు స్వాధీనం చేసుకున్నాము. పూనమ్ , దీపక్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించారు. వారిని విచారించగా అంజన్ దాస్ ని హత్య చేశామని అంగీకరించారు.జూన్ 5న రాంలీలా మైదాన్‌లో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నాము” అని తెలిపారు క్రైమ్ డిసిపి అమిత్ గోయల్.