గాడ్ ఫాదర్ విషయంలో చిరంజీవి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

-

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల చేయాలంటే కాస్త భయపడుతున్నారు. ముఖ్యంగా కరోనా పరిస్థితిల వల్ల ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టివేసింది. ఇక గతంలో ఎంతో ఖర్చు చేసినప్పటికీ ఇప్పుడు ఖర్చు చేయాలంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గతంలో ఎన్నో సినిమాలు విడుదలైన మిస్ కాకుండా చూసేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమా అయినా సరే థియేటర్లకు వెళ్లాలి అంటే భయపడాల్సి వస్తున్నారు. ముఖ్యంగా టికెట్ల ధరలు, లోపల తినుబండారాల ధరలు చూసి సామాన్యుల సైతం భయపడుతూ ఉన్నారు.

అందుచేతనే సినిమాలకు వెళ్లడానికి కొంతమంది సినీ ప్రేక్షకులు సైతం నిరాకరిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కొన్ని సినిమాలకు టికెట్లు రేట్లు మరింత పెంచడంతో ఆ ఎఫెక్ట్ సినిమాల పైన భారీగానే ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అందుచేతనే ఇప్పుడు స్టార్స్ హీరోలు సైతం తమ ఆలోచనలను మార్చుకొని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా టికెట్ల ధరలను ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా దసరాకి విడుదల కాబోతున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ తదితర సినిమాల టికెట్లు ధరలను కూడా తగ్గించినట్లుగా తెలుస్తున్నది.

ముఖ్యంగా చిరంజీవి ఆచార్యతో భారీ డిజాస్టర్ కావడంతో ఎలాగైనా ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఉన్నారు చిరంజీవి. మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70MM లో టికెట్టు ధరలు రూ 150 రూపాయలు మాత్రమే అందుబాటులో ఉన్నది. మొదటి రోజు కూడా ఇదే ధరలు ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దీన్ని బట్టి చూస్తే సినిమా టికెట్ ధర ఎంత తక్కువ ఉంటే ప్రేక్షకులు అంత ఎక్కువ మంది వస్తారని చిరంజీవి భావిస్తున్నట్లుగా సమాచారం. అందుచేతనే సినిమా టికెట్ల రేటు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news