మంత్రి పదవికి రాజీనామా చేస్తా : హరీష్

-

దుబ్బాక లో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మొత్తం హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక అన్ని పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ ప్రజానీకం మొత్తం ప్రభుత్వ పాలనపై వ్యతిరేకంగా ఉంది అంటూ నిరూపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే… గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టుగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించి టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి దుబ్బాకలో ఎమ్మెల్యే గా మారిపోతాడు అని అధికార పార్టీ ధీమా తో ఉంది.

ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల మంత్రి హరీష్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న రెండు వేల పింఛన్ లో 1600 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అంటూ ప్రచారం చేస్తూ మాయ మాటలు చెబుతూ బండి సంజయ్ ఓటర్లను మోసం చేస్తున్నారని ఒకవేళ కేంద్రం 1600 ఇస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నిరూపించ లేకపోతే బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి అంటూ సవాల్ విసిరారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news