గర్భిణులు పుట్టగొడుగులు తినొచ్చా..?

-

పుట్టగొడుగులు ఆరోగ్యానికే మంచివే అయినా.. వీటిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. దొరికిన పుట్టగొడును తింటే..ప్రాణాలే పోతాయి. తాజాగే విషపూరితమైన పుట్టగొడుగులు తిని తండ్రికొడుకు చనిపోయారు. అయితే ఇందులో తినగలిగేవి ఎంచుకుని తినడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ప్రగ్నెంట్‌ లేడీస్‌ పుట్టగొడుగులు తినొచ్చా..? సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు ఎం తినాలో ఎం తినొద్దో ఇంట్లో వాళ్లకు బాగా అవగాహన ఉండాలి. అవి మంచివే అయినా.. గర్భిణుల ఆరోగ్యానికి చెడు చేస్తాయేమో ఆలోచించుకోవాలి. తెలిసి తెలియకుండా పెడితే తల్లితో పాటు లోపల బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం.. మరీ ఇంతకీ ప్రగ్నెంట్‌గా ఉన్నప్పుడు పుట్టగొడుగులు తినొచ్చో లేదో చూద్దామా..!
ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారంటే.. పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యునిటీ శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పుట్టగొడుగులు ముందంజలో ఉంటాయి. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులను తినవచ్చు. అయితే ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమట.. అవేంటంటే..

పుట్టగొడులు తినే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మార్కెట్లో ఎన్నో రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో పారాసోల్ పుట్టగొడుగులు, ఫాల్స్ మోరల్స్‌ పుట్టగొడుగులను మాత్రం అస్సలు తినకూడదు.
పుట్టగొడుగులను ఎప్పుడూ పరిమిత మోతాదులో మాత్రమే తినాలి. బాగున్నాయి, ఆరోగ్యానికి మంచివి కాదా అని అదేపనిగా అస్సలు తినకూడదు.
వీటిని నీళ్లతో బాగా శుభ్రం చేసి, ఉడికించి తినాలి. పచ్చిగా మాత్రం అస్సలు తినకూడదు.
మష్‌రూమ్స్‌ తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిల్వ ఉన్న వాటిల్లో పురుగులు చేరుతాయి. అవి మన కంటికి కనిపించకపోవచ్చు.. తాజాగా ఉన్నవాటినే కొనుక్కోని అప్పుడే వండుకోని తినాలి..
గర్భిణులు తినొచ్చు ఆరోగ్యనిపుణులు అంటున్నారు కానీ.. మీ ఆరోగ్యాన్ని బట్టి ఇవి తినడం మంచిదో కాదు.. రెగ్యులర్‌గా వెళ్లే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినడం బెటర్‌.. డాక్టర్ సలహా మేరకు తింటే గర్భిణుల ఆరోగ్యానికి మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news