తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని దూకుడుగా రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో మాత్రా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ అయ్యాక రేవంత్‌కు హుజూరాబాద్ మొదటి పరీక్ష కానుందని విశ్లేషణలు వచ్చాయి. కానీ రేవంత్ మాత్రం ఆ ఉపఎన్నికని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక తన సామర్ధ్యానికి పరీక్ష కాదని మొదట్లోనే రేవంత్ తేల్చి చెప్పేశారు.
అయితే హుజూరాబాద్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్, ఈటల మధ్యలో కాంగ్రెస్ గెలవడం చాలా కష్టమని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ని బాగా యాక్టివ్ చేస్తే, ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్‌కు లబ్ది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు రేవంత్ మెయిన్ టార్గెట్ టీఆర్ఎస్ ఓటమి కాబట్టే, హుజూరాబాద్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉంటున్నట్లు కనిపించడం లేదు.
కాకపోతే రేవంత్ వ్యూహం ఎలా ఉన్నా సరే అది కాంగ్రెస్‌కే నష్టమని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఎలా లేదనుకున్న హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు కాస్త బలం ఉంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌కు ఉన్న బలాన్ని తగ్గించేస్తున్నాయి. హుజూరాబాద్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్, బీజేపీల్లోకి వెళ్లిపోతున్నారు.
దీంతో నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. పైగా ఉపఎన్నికలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాదిరిగా ఫైట్ జరుగుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ రేసులో లేదు. ఇక ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయంగా టీఆర్ఎస్, బీజేపీ అనే విధంగా ఫైట్ జరిగితే కాంగ్రెస్ వెనక్కి వెళ్లిపోవాల్సిందే. ఓ రకంగా ఇది కాంగ్రెస్ శ్రేణులని ఇబ్బంది పెట్టే విషయం కాబట్టి, హుజూరాబాద్‌లో రేవంత్ దూకుడుగా ఉండాల్సిన అవసరముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ఓడిపోవాలని లైట్ తీసుకుంటే, తర్వాత కాంగ్రెస్‌కు ఇబ్బంది అవుతుందని అంటున్నారు.