మహారాష్ట్ర సీఎంకు ముచ్చెమటలు.. ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయట పడతారా?

-

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి బీజేపీ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేనకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ చేరుకున్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం చిక్కుల్లో చిక్కుకుంది. దీంతో ఈ రోజు సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే

శివసేన పార్టీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే సూరత్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారని సమాచారం. అయితే వీరిలో శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్దవ్ ఠాక్రేకు చెమటలు పడుతున్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి అడుపు పెట్టడానికి సిద్ధమవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సూరత్‌లోని ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడేందుకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కొంత మంది ఎమ్మెల్యేలను పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు సఫలం అయితే.. షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news