ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం వైయస్.జగన్… ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వండని.. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కనిపించాలని హెచ్చరించారు. గుంతలు లేకుండా రోడ్లను తీర్చి దిద్దాలని.. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టండని ఆదేశించారు.
కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి ఆదేశించిన సీఎం జగన్.. జులై 20 న ఫొటో గ్యాలరీలు పెట్టాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా రోడ్ల నిర్వహణ, మరమ్మతుల పై కార్యాచరణ సిద్ధం చేయాలని.. గిరిజన సంక్షేమశాఖలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి పెట్టాలని వెల్లడించారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, అభివృద్ధి పనులు ఆగిపోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.