కేజీఎఫ్ సినిమా తో కన్నడ స్టార్ హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ కూడా బాగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కే జి ఎఫ్ చాప్టర్ టు కూడా విడుదల చేయడం జరిగింది. రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమాపై మరింత క్రేజ్ కూడా పెరిగింది.
ముఖ్యంగా మొన్నటివరకు కేజిఎఫ్ మేనియా దేశాన్ని దులిపేసిందనే చెప్పాలి . పార్ట్ వన్ నుంచి మంచి ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించడం తో ఈ సినిమాపై హైప్ పెరిగింది. మొత్తంగా 1,100 కోట్ల రూపాయలను ఈ సినిమా అందుకున్నట్లు సమాచారం. ఇకపోతే కేజిఎఫ్ 2 లో కే జి ఎఫ్ త్రీ కూడా ఉంటుందని హింట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే పార్ట్ త్రీ పై అందరి ఫోకస్ పడడంతో ఈ సినిమాలో అవకాశం వస్తే చాలు నటించడానికి బాలీవుడ్ నటీనటులు కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం.
చాప్టర్ 2 లో హీరోయిన్ క్యారెక్టర్ ను చంపేయడం తో పార్టీ 3 కోసం ప్రశాంత్ నీల్ మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇక దీంతో ఎవర్ని సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో నిర్మాతలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన సినిమాల్లో నటిస్తే క్రేజ్ అమాంతం పెరిగి పోతుంది కాబట్టి యష్ సినిమాలో నటించడానికి బాలీవుడ్ భామలు ఆరాట పడుతున్నట్టు సమాచారం..మరి ప్రశాంత్ నీల్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది.