Breaking : మందుబాబులకు బాడ్‌న్యూస్‌.. 5 రోజులు వైన్స్‌ బంద్‌

-

మద్యం ప్రియులకు షాక్ ఇచ్చే వార్తను ప్రభుత్వం చెప్పింది. వరుసగా ఏకంగా ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని వెల్లడించింది. శ్రీ కృష్ణ జన్మాష్ఠమి సందర్భంగా రెండు రోజులు, జీ 20 దేశాధినేతల సదస్సు సందర్భంగా మరో 3 రోజులు లిక్కర్ దుకాణాలు మూసి వేసి ఉంటాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మద్యం ప్రియులు.. లిక్కర్ షాప్‌లకు క్యూ కట్టారు. ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉండనున్న నేపథ్యంలో తమకు ఇష్టమైన, అవసరమైనంత మందును ముందుగానే కొని దాచి పెట్టుకుంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా వైన్ షాపుల ముందు భారీగా జనం లైన్లలో నిలుచుంటున్నారు.

Miscreant loots wine shop in Hyderabad amid lockdown | India News – India TV

సెప్టెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయని ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో జీ 20 సమ్మిట్ ఢిల్లీలో జరగనుంది. దీంతో కేంద్రం 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలీడే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజుల్లో మార్కెట్లు, స్కూళ్లు, బ్యాంకులు, అన్ని రకాల షాపులు మూతపడనున్నాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 6,7 తేదీల్లో మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని షాపు యజమానులను ఆదేశించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news