ఈ కొత్త ఫీచర్ తో మీ పిల్లలు ఇంస్టాగ్రామ్ లో ఏం చేస్తున్నారో చూడచ్చు..!

-

ఈ మధ్య ఇంస్టాగ్రామ్ ని కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా మనం ఇతరులు పోస్టు చూడొచ్చు. అలానే మనం కూడా ఏదైనా పోస్ట్ చేయొచ్చు. దానితో పాటు మనం రీల్స్ ని కూడా చూసుకోవచ్చు. అయితే ఇంస్టాగ్రామ్ ఉపయోగించే పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎలాంటి కంటెంట్ ని చూస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు చూసుకోవచ్చు. మరి ఇక ఆ కొత్త ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం.

 

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram

పేరెంటల్ సూపర్ విజన్ ఫీచర్ తో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంస్టాగ్రామ్ లో ఎంత సమయాన్ని గడుపుతుంటారు..? ఎవరెవరు ఎకౌంట్లను చూస్తున్నారు..? వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అలానే ఇతరుల ఖాతా గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది.

మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఫీచర్ కావాలనుకుంటే ముందుగా తమ పిల్లల ఖాతా నుంచి ఫీచర్ ఆక్టివేట్ చేయాలని ఇంస్టాగ్రామ్ చెప్పింది. పిల్లలు ఉపయోగించే ఖాతా నుండి పేరెంటల్ సూపర్ విజన్ కోసం రిక్వెస్ట్ పంపాలి. దానికి పిల్లలు ఓకే చేస్తే అప్పుడు తల్లిదండ్రులు అకౌంట్ని చూసుకోవచ్చు.

అయితే ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికా యూజర్లకి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ ని ఇండియా తో పాటు అన్ని దేశాలకు కూడా తీసుకురానున్నారు. అలానే క్వెస్ట్ హెడ్ సెట్స్ లో కూడా వర్చువల్ రియాలిటీ పేరంటల్ సూపర్ విజన్ టూల్స్ ని తీసుకురానున్నారు దీంతో పిల్లలు అభ్యంతరకరమైన ఆప్స్ డౌన్లోడ్ చేయకుండా కట్టడి చేయచ్చు ఇలా ఇన్స్టాగ్రామ్ ఫీచర్లతో పిల్లల్ని ఒక కంట కనిపెట్టచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news