ఈ ప్యాక్ తో ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి మాయం

-

సమ్మర్ లో హెల్త్ మాత్రమే కాదు.. స్కిన్ కూడా పాడువుతుంది. పొడిబారిపోవడం, టాన్ అవడం ఎక్కువగా జరుగుతుంది. ఉష్ణోగ్రత నుంచి బాడీని కాపాడుకోవాలంటే.. హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్లు అయినా వాటర్ తాగాలి. వీలైతే రోజుకో కొబ్బరిబోండాం నీళ్లు కూడా తాగితే.. హెల్త్ కు స్కిన్ కు బాగా మంచిది. వీటితో పాటు ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం నిగారింపు సొంతం చేసుకుంటుంది. వేసవిలో కూడా స్కిన్ గ్లోయింగ్ చెదరదు.

సమ్మర్ లో బొప్పాయి పళ్లు విరివిగానే దొరుకుతాయి. వీటిని తినడంతో పాటు.. ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిజానికి ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్ స్కిన్ కు బాగా మేలు చేస్తాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని స్కిన్ టోన్స్ కు బాగా సెట్ అవుతాయి. అందులో బొప్పాయి ఒకటి. బొప్పాయి ఏ రకమైన చర్మానికి అయినా ఇట్టే నొప్పుతుంది. బొప్పాయితో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బాగా పండిన అరకప్పు బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్‌ స్పూన్ల గంధం పొడి వేసి కలపండి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఉంచుకోవాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ వేసుకోడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి వదిలి, చర్మం కాంతివంతంగా కనిపించడమే కాదు, మృదువుగా ఉంటుంది.

టైం లేనప్పుడు సింపుల్ గా ఇలా చేసేయండి..

కప్పు పెరుగులో టేబుల్‌ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్‌ను ఇవ్వడంతో పాటు.. కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

అయితే ఫేస్ మాస్క్ వేసినప్పుడు కనీసం 7-8 గంటల పాటు ఫేస్ కి ఎలాంటి సోప్, మాయిశ్చరైజర్, క్రీమ్స్ లాంటివి రాసుకోకూడదు. అలా ఏమి రాయకుండా ఉంటేనే ఫేస్ ప్యాక్ రిజల్ట్ బాగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ.. ఈవినింగ్స్, నైట్ టైంలో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతే.. క్లీన్ చేసుుకుని పడుకుంటే.. మార్నింగ్ ఫేస్ సూపర్ లుక్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news