బీజేపీ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ నిఘా.. హెచ్‌ఐసీసీలో ప్రవేశించిన ఇంటెలిజెన్స్‌ అధికారి..

-

హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్‌కు ఇప్పటికే చేరుకున్నారు. నిన్న ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు రెండో రోజు హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్నాయి. అయితే ఈ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ నిఘా పెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ సమావేశాల్లో స్టేట్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ అధికారి బీజేపీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ బుక్‌లోని పేజీలను ఫోటోలను తీస్తుంటే బీజేపీ శ్రేణులు పట్టుకున్నారు.

TRS needs Dharna Chowk, says BJP

అనంతరం ఆయనను కమిషనర్‌కు అప్పగించారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నిఘాధికారి శ్రీనివాసరావును పట్టుకోవడం జరిగిందని, లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్ ను ఫోటో తీసే ప్రయత్నం చేశారన్నారు. ఫోటోలన్నిటినీ డిలీట్ చేయించామనన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదని ఆయన విమర్శించారు. అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదన్నారు. గతంలో మీరు సమావేశ నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు ఇంద్రసేనా రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news