ఎనిమిది పదుల వయస్సులోనూ భర్త శృంగారం కోసం వేధిస్తున్నాడని ఓ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏం చేయాలో పాలుపోక చివరకు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. దీనిపై వెంటనే స్పందించిన బృందం.. ఈ వృద్ధ దంపతులకో ఓ మార్గాన్ని చూపించింది. వారి ఇచ్చిన సూచనల తర్వాత ఆ తన భర్త నుంచి ఆమెకు వేధింపులు తగ్గాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది.
గుజరాత్‌లోని మహిళల కోసం ‘181 అభయం’ పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటైంది. దీని నిర్వాహకులకు ఇటీవల వృద్ధురాలి నుంచి ఫోన్ వచ్చింది. సెక్స్ కోసం తన భర్త తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడని, దాన్ని నిరాకరిస్తున్నందుకు తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని వాపోయింది. అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెబుతున్నా ఆయన పట్టించుకోవడంలేదని పేర్కొంది.
దీంతో ‘అభయం’ బృందం.. ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుంది. కౌన్సెలింగ్ ఇచ్చింది. యోగాను అభ్యసించాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని వృద్ధుడికి సూచించింది. ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు సీనియర్ సిటిజన్ల గార్డెన్లు, పార్కులను సందర్శించాలని హితవు పలికింది. మొత్తంమీద ఈ సూచనలు పనిచేశాయని సమాచారం.