టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాయి లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలోని నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 17 మందిని సిట్ అరెస్ట్ చేసింది. తాజాగా లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుస్మిత కోసం లౌకిక్ డీఏఓ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి పేపర్‌ను రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న జరిగిన DAO పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు పంపించారు. ఈ నెల 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. ఎన్నారై ప్రశాంత్‌పై మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది.