పెన్షన్‌ కోసం భర్తను ‘చంపేసిన’ మహిళ వాలంటీర్..

ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను పొందాలని చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. అయితే ఓ బాధ్యతాయుత పోస్టులో ఉన్న మహిళ.. పెన్షన్‌ కోసం తన భర్తను చంపేసింది. అయితే ఆమె తన భర్తను నిజంగా హత్య చేయకపోయినా, మరణించకపోయినా.. తన భర్త మరణించినట్లు డెత్‌ సర్టిఫికేట్‌ సృష్టించి పెన్షన్‌ పొందుతోంది. అయితే.. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వైయస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాదిన్నర కుమారుడున్నాడు. ఐతే భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో విడిగా ఉంటున్నారు.

Indian rupee dips despite big gains in equity markets - News | Khaleej Times

ఈ క్రమంలో భార్య వాలంటీర్ గా పనిచేస్తోంది. ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్లు పంచడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమోదు చేస్తుండటంతో పథకాలు ఎంలా పొందాలి, ఎలా సర్టిఫికెట్లు మార్చాలి, అర్హతలను ఎలా చూపించాలనేదానిపై పట్టుసాధించింది. దీంతో భర్తకు దూరంగా ఉంటున్న తనకు వితంతు పెన్షని రాయించుకోవాలన్న ఆలోచనతో రావడంతో.. వెంటనే రంగంలోకి దిగి బ్రతికున్న భర్త చనిపోయాడంటూ వీఆర్వో సాయంతో సర్టిఫికెట్ సృష్టించింది. వెంటనే సచివాలయంలో నమోదు చేయించుకోని వితంతు పింఛన్ కార్డు పొందింది చక్కగా పెన్షన్ తీసుకుటోంది.

అయితే ఇటీవల.. విషయం తెలియక ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి భర్త సుభాహాన్ చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిసి దరఖాస్తు చేశాడు. ఐతే రేషన్‌ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో ఖంగుతిన్న సుభాహాన్.. తన పేరును ఎలా తొలగిస్తారని ఆరా తీశాడు. అతడు మరణించినట్లు నమోదైందని సిబ్బంది వివరించడంతో షాక్‌కు గురైన సుభాహాన్‌ వెంటనే కార్డు తీసుకొని రాయచోటికి వెళ్లి తహసీల్దార్‌ను కలిశాడు.

కొత్తపల్లి-3 గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయ రెడ్డి లాగిన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మరణించినట్లు నమోదైనట్లు అధికారులు గుర్తించి.. అధికారులు ఆరా తీయగా భార్యే వీఆర్వోతో కలిసి ఈ పనిచేసినట్లు తేలింది. దీంతో అక్రమంగా తాను చనిపోయినట్లు రికార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అధికారులు, భర్త సుభాహాన్.