పబ్‌జీ ప్రేమాయణం.. ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి భర్తను వదిలేసి ఇండియాకు

-

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో పరిచయమైన ఫ్రెండ్‌ను రియల్‌గా కలవడం మీరు చూసి ఉంటారు, కొంతమంది అయితే వాళ్లను ప్రేమిస్తారు కూడా. కానీ ఇది పబ్జీ ప్రేమ. అది కూడా మన దేశంలో కాదు. పాకిస్తాన్‌ నుంచి ఓ మహిళ నలుగురు పిల్లలను వదిలేసి మరీ ఈ పబ్జీ ప్రేమికుడి కోసం ఇండియాకు వచ్చేసిందట. అవ్వ.. విన్నడానికే వింతగా ఉంది, ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? ఓ పాలి ఈ స్టోరి వైపు లుక్కేసేయండి మరీ..!

పబ్‌జీ ద్వారా పరిచయమైన నోయిడా కుర్రాడితో ప్రేమలో పడింది పాకిస్థాన్‌ మహిళ. అప్పటికే ఆమెకి పెళ్లై నలుగురు పిల్లలున్నారు. అయినా ఆ కుర్రాడే కావాలని పట్టు పట్టింది. ఎలాగైనా అతనితోనే కలిసి బతకాలని నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలతో పాటు బార్డర్ దాటి మరీ గ్రేటర్ నోయిడాకి వచ్చింది. అక్కడే ఓ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. నేపాల్ మీదుగా ఆ మహిళ ఇండియాకు వచ్చింది. ఇద్దరికీ పెళ్లైందని అబద్ధం చెప్పి ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. రహస్యం బయట పడగానే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఆ మహిళ ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది.

రబూపురకు చెందిన సచిన్‌ పబ్‌జీకి అడిక్ట్ అయ్యాడు. అలా ఆడే క్రమంలోనే పాకిస్థాన్‌ మహిళతో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. నువ్వు లేకుండా నేను బతకలేను అనే స్థాయికి చేరింది వీళ్ల ప్రేమ. మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి వచ్చేయాలని ఫిక్స్ అయింది. అనుకున్న వెంటనే నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. గ్రేటర్ నోయిడాలోనే సచిన్‌తో పాటు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ విషయం బయటపడడం వల్ల పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరి కోసం గాలించారు.

అక్రమంగా దేశంలోకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. మూడు టీమ్స్ వాళ్ల కోసం గాలించాయి. CCTV ఫుటేజ్‌లు పరిశీలించాయి. మొత్తానికి ఆ మహిళ పోలీసుల కంట పడింది. దర్యాప్తు సంస్థలూ ఈ కేసుని తీసుకున్నాయి. ఆ మహిళ పేరు సీమ గులాం హైదర్‌గా తెలుస్తోంది. పబ్‌జీ ద్వారా సచిన్‌తో పరిచయమైందని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news