నీళ్ల కోసం.. సాహసమే చేస్తున్న మహిళలు.. ఏకంగా 60 అడుగుల బావిలోకి దిగి..

-

సమ్మర్‌లో ఎండకే ప్రజలు అల్లాడుతుంటే… దానికి తోడు మంచి నీటి సమస్య కూడా వేధిస్తుంటే పరిస్థితి ఏంటి.. తాగునీటి కోసం.. అక్కడి మహిళలు సాహసమే చేస్తున్నారు. బావిలోకి దిగుతూ ప్రాణాలకు తెగించి నీళ్లకోసం..పాటుపడుతున్నారు. కడుపు నిండా తిండి లేకపోయినా బతకొచ్చు కానీ.. నీళ్లు లేకపోతే బతకలేం. మనదేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాంల్లో నీటి కొరత అక్కడ ప్రజలను వేధిస్తుంది.
బిందేడు నీళ్ల కోసం మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ప్రతిరోజూ హృదయాన్ని కదిలించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కొన్ని మారుమూల గ్రామాల్లో గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బావిలో దిగుతున్నారు. ఇంట్లో వాళ్లకు దాహం తీర్చాలంటే.. ఆ ఇంటి ఇల్లాలు ప్రాణాలకు తెగించి ఆ బావిలో దిగాల్సిందే. ఏకంగా 60 అడుగుల లోతున్న బావిలో దిగి రోజూ ఇళ్లకు నీళ్లు తీసుకెళ్తున్నారు. పోనీ అంత కష్టపడి దిగుతున్న వాళ్లకు నీళ్లు ఏమైనా పుష్కలంగా ఉన్నాయా అంటే.. అదీ లేదు.. ఆ బావిలో నీళ్లు అడుక్కొచ్చాయి. పాపం గీరుకొని బిందెల్లో నింపుకుంటున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఘుసియాలో కూడా ఇదే పరిస్థితి. బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకుని ఎక్కడం దిగడం చేస్తున్నారు.. అలాంటి టైమ్‌లో కాస్త కాలు జారినా ఇక అంతే సంగతులు. నీటి కోసం మహిళలు ఎలాంటి తాడు నిచ్చెన సాయం లేకుండా బావిలో దిగుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. మహిళలు ఇలా నీళ్లు తెచ్చే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.. ఇది చూసిన నెటిజన్లు అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది అని నిలదీస్తున్నారు.
మరికొందరు.. ఆ మహిళల కష్టాన్ని చూసి చలించిపోతున్నారు. నీరు పుష్కలంగా ఉన్నతం కాలం.. మనకు వాటి విలువ తెలియదు. మనలో చాలామంది.. వాటర్‌ను విపరీతంగా వేస్ట్‌ చేస్తుంటారు. అన్నం కంటే.. నీరు చాలా ముఖ్యం.. కడుపు కాలితే.. గ్లాసుడు నీళ్లు తాగి సరిపెట్టుకోవచ్చు.. రోజంతా ఏం తినకుండా అయినా ఉండొచ్చేమో కానీ.. వాటర్‌ లేకుండా మనిషి బతకలేడు. బండికి పెట్రోల్‌ ఎంత ముఖ్యమే..మనిషికి వాటర్‌ అంత ముఖ్యం.!

Read more RELATED
Recommended to you

Latest news