ఏమి టాలెంట్ భయ్యా..ఐడియాకు లైక్ వేసుకోవాల్సిందే..

-

బొమ్మలు వెయ్యడం అంటే చాలా మందికి సరదా.. ఆ సరదానే వ్యాపారంగా మార్చుకొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..పెన్సిల్, కలర్స్, ఆయిల్ పెయింట్స్ వెయ్యడం అందరూ చూసే ఉంటారు..ఇవేవీ కాకుండా, వీటి అవసరం లేకుండా అచ్చుగుద్దినట్టు అన్నిరకాల బొమ్మలేయడం ఎప్పుడైనా చూశారా..లేదు కదూ..అసలు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు కదూ..సాధ్యం కానీ దానిని సాధించి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు ఓ యువకుడు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులోని మయిలాదుతురై అనే ఊళ్లో ఉంటాడు 31 ఏండ్ల విఘ్నేష్‌. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఇంట్రెస్ట్‌ ఉన్నా దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు ఇతను. బీటెక్‌ పూర్తిచేసి ఇంజనీరింగ్‌ జాబ్‌ కూడా చేశాడు. తరువాత కొన్ని రోజులకి అనారోగ్య సమస్యలు వచ్చి నెల రోజులు మంచానపడ్డాడు. అప్పుడే జాబ్‌పోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు ఖాళీగా ఉండి మళ్లీ బొమ్మలేయడం మొదలుపెట్టాడు. పెన్సిల్‌తో మనుషుల డ్రాయింగ్‌ వేసి అమ్మేవాడు. అవి అమ్మితే వచ్చిన డబ్బుతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది..

ఫారిన్ దేశాలలో ఓ వ్యక్తి సూర్య కిరణాల ద్వారా భూతద్దంతో చెక్క పై బొమ్మలు వెయ్యడం చూశాడు. విఘ్నేష్‌ అతనిలా ట్రై చేయాలనుకున్నాడు. మొదట్లో చెక్కమీద పేర్లు రాయడం ప్రాక్టీస్‌ చేశాడు. దాంట్లో నైపుణ్యం రాగానే బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటివరకు రకరకాల బొమ్మల్ని సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌ ద్వారా చెక్కాడు విఘ్నేష్‌. ఈ ఆర్ట్‌ వేయడానికి దాదాపు రెండు రోజుల టైం పడుతుందట. ఇవే కాకుండా పెన్సిల్‌ ఆర్ట్‌, 3డి ఆర్ట్‌లు కూడా వేస్తున్నాడు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫిల్టర్‌ కాఫీ 3డి డ్రాయింగ్‌ ఇమేజ్‌ విఘ్నేష్​ గీసిందే. ఇతను గీసిన బొమ్మలు, ఆయిల్‌ పెయింటింగ్స్‌, సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌లు నచ్చి పెండ్లిళ్లకు, బర్త్‌డే పార్టీలకు గిఫ్ట్‌ ఇవ్వడానికి ఆర్డర్స్‌ ఇస్తున్నారు. చాలారకాల అవార్డ్‌లు కూడా అందుకున్నాడు..అతడి పెయింటింగ్ కు మంచి ఏర్పడింది.. ప్రభుత్వ స్కూల్లో ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పాడు..ఏది ఏమైనా టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించాడు..

Read more RELATED
Recommended to you

Latest news