అభిమానుల కోరిక: సెమీఫైనల్ 1 లో ఇండియా vs పాకిస్తాన్ ?

-

వరల్డ్ కప్ లో ఇక కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. లీగ్ స్టేజ్ లో 45 మ్యాచ్ లు ఆడనుండగా , సెమీఫైనల్ 1 , 2 మరియు ఫైనల్ తో కలిపి మూడు మ్యాచ్ లు మొత్తం 48 ఉన్నాయి. సెమీఫైనల్ కు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మూడు జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఇండియా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత రెండు మూడు స్థానాలలో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లు ఉన్నాయి. నాలుగవ స్థానంలో కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు ఆఫ్గనిస్తాన్ లు పోరాడనున్నాయి. మూడు జట్లకు ఇక ఒక్క మ్యాచ్ మాత్రమే ఉండగా.. గెలవడమే కాకుండా ఇతర మ్యాచ్ ల ఫలితాల మీద ఆధారపడవలసి వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రకారం పాకిస్తాన్ నాలుగవ సెమీఫైనలిస్ట్ గా రావాలని అందరూ కోరుకుంటున్నారు.

ఎందుకంటే పాకిస్తాన్ సెమీఫైనల్ కు వస్తే ఇండియాతో తలపడుతుంది కాబట్టి. మరి ఆ విధంగా జరగాలంటే పాకిస్తాన్ తప్పక ఇంగ్లాండ్ పై గెలవాలి… న్యూజిలాండ్ శ్రీలంక తో ఓడిపోవాలి. మరి అది జరుగుతున్నా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version