బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణ్ వీర్ సింగ్ తాజాగా న్యూడ్ ఫోటో షూట్ తో అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు హీరోయిన్లను మనం బికినీలో చూసాం.. అలాగే కొంతమంది నగ్నంగా కూడా ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే .కానీ మొదటిసారి మ్యాగజైన్ కోసం ఈ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఏకంగా న్యూడ్ ఫొటో షూట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే మ్యాగజైన్ కోసం ఇలా న్యూడ్ ఫోటోలను వదలడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ రణవీర్ తీసుకువచ్చిన కొత్త ట్రెండుకు ఇష్టపడిన ఎంతోమంది యంగ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా ఈయన బాటలోనే నడుస్తూ జనాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
ముఖ్యంగా హీరోయిన్లకు తామేం తక్కువ కాదన్నట్లుగా శరీర సౌందర్యాన్ని చూపించడంలో హీరోలు కూడా ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని రణవీర్ సింగ్ చేసిన ఒక న్యూడ్ ఫోటోషూట్ ప్రస్తుతం పలు చర్చలకు తావిచ్చింది. అంతేకాదు కొన్ని వేల మంది ముందు కూడా తాను బట్టలు లేకుండా రాగలనని.. తనను ఎవరు ఎంత తిట్టినా సరే పట్టించుకోనని సోషల్ మీడియా వేదికగా ఈయన ట్వీట్ చేయడంతో మరింత సంచలనానికి దారితీసింది. అంతేకాదు రణవీర్ సింగ్ పై ముంబైలోని చెంబూరి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయనపై అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67A సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా రణవీర్ ఫోటోషూట్ చేశాడు అని తన ఫిర్యాదులో ఆరోపించారు చౌభే..
ఇదిలా ఉండగా రణ్వీర్ సింగ్ ఫోటోషూట్ కోసం ఎంత ఛార్జ్ చేశారు అనే విషయాన్ని తాజాగా ఉమైర్ సందు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక రణవీర్ సింగ్ ఇలా మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకుగాను అక్షరాల 55 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇది విన్న నెటిజన్స్.. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.