సుహాస్ ‘Writer Padmabhushan’ ట్రైలర్ అదుర్స్‌

-

టాలీవుడ్‌లో ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారిన యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ ఇప్పటికే సినీ సర్కిల్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. సుహాస్ ‘హిట్ 2’ లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్‌‌‌‌తోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇదివరకే స్టోరీ లైన్, పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా Writer Padmabhushan ట్రైలర్ ని లాంచ్ చేసింది. అమ్మా నాన్న, ఓ లవ్ స్టోరీ స్టోరీలైన్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో స్ట్రగులింగ్ రైటర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు సుహాస్.

ఫిబ్రవరి 3న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా కాన్ఫిడెంట్‌‌‌‌గా
కనిపిస్తున్నాడు సుహాస్. ట్రైలర్‌‌ను బట్టి విజయవాడ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కథ ఉంటుందని అర్ధమవుతోంది. టీనా శిల్పరాజ్ హీరోయిన్‌‌‌‌. ఆశిష్ విద్యార్థి, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news