టీకాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాక్రే స్వయంగా ఫోన్ చేయడం వల్లే గాంధీభవన్ కు వచ్చినట్లు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్ జెండాతోనే పని చేశానని.. గాంధీభవన్తో 30 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్ను ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది పార్టీ మీటింగ్లో చెప్తానని వెల్లడించారు. తనలాంటి సీనియర్లు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించానని అన్నారు. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు. అనంతరం.. గాంధీభవనల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది.
గాంధీభవన్‌లో అడుగు పెట్టనని శపథం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన ఒట్టును గట్టు మీద పెట్టారు. గాంధీభవన్‌కు
వచ్చారాయన. ఎప్పుడూ గాంధీభవన్‌కు వచ్చే సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు.. ఈసారి వచ్చి అలిగి వెళ్లిపోయారు. మహేష్‌గౌడ్‌తో గొడవపడి ఇక్కడ అందరూ నాయకులే అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయారాయన. టి.కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించాక రెండోసారి హైదరాబాద్ వచ్చిన మాణిక్‌రావు థాక్రే.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నాయకుల రాకతో గాంధీభవన్ మరోసారి కళకళలాడుతోంది.