మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఎంఐ 10 5జి ని భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అలాగే గేమ్స్ ఆడినప్పుడు, వీడియోలు చూసినప్పుడు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సమయంలో ఫోన్ వేడి కాకుండా ఉండేందుకు గాను ఇందులో లిక్విడ్ కూలింగ్ హార్డ్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
షియోమీ ఎంఐ 10 5జి స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు మరో 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4780 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 30 వాట్ల వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే 10 వాట్ల రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు.
షియోమీ ఎంఐ 10 5జి స్పెసిఫికేషన్లు…
* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్
* 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 108, 13, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
* యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6 802.11 ఏఎక్స్
* బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4780 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్
ధర…
షియోమీ ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్ కోరల్ గ్రీన్, ట్విలైట్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.49,999 గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.54,999గా ఉంది. మే 18వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇందుకు ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.2499 విలువ గల ఎంఐ వైర్‌లెస్ పవర్‌బ్యాంక్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
కాగా ఈ ఫోన్‌తోపాటు షియోమీ ఎంఐ 30 వాట్ల వైర్‌లెస్ చార్జర్, ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2ను కూడా విడుదల చేసింది. వైర్‌లెస్ చార్జర్ ధర రూ.2299 ఉంది కానీ.. లాంచింగ్ సందర్భంగా దీన్ని రూ.1,999 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2ను రూ.4499 కు కొనుగోలు చేయవచ్చు. కానీ మే 12 నుంచి 17వ తేదీల మధ్య ఈ ఇయర్‌ఫోన్స్‌ను రూ.3,999 కే అందివ్వన్నారు. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.