అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లో దూసుకుపోతున్న షావోమీ కొత్త టీవీ..

-

షావోమీ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ఉన్న వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది..ఇప్పటి వరకూ ఈ కంపెనీ విడుదల చేసిన అన్నీ వస్తువులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కస్టమర్లకు మరింత దగ్గరైందెకు ఇప్పుడు మరో స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఆ టీవీ వచ్చి కేవలం కొద్ది రోజులు అయిన కూడా డిమాండ్ మాత్రం బాగుంది.ఇప్పుడు ఆ టీవీ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..

- Advertisement -

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇప్పుడు మార్కెట్ లోకి విడుదలైన టీవీ..షావోమీ టీవీ ఈఎస్ ప్రో.. 83 ఇంచుల IPS డిస్‌ప్లేతో వస్తుంది. 4K (3,840ం2160 పిక్సెల్) రెజల్యూషన్, 94శాతం DCI-P3 కలర్ గాముట్, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. క్వాడ్ కోర్ Cortex-A73 ప్రాసెసర్‌, MIUI TV ఓఎస్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటుంది.

డాల్బీ అట్మోస్, DTS-HD సపోర్ట్ ఉండే 30 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను Xiaomi TV ES pro 86-inch స్మార్ట్ టీవీ కలిగి ఉంది. ఎనిమిది స్పీకర్లు ఈ టీవీలో ఉండగా.. వాటిలో రెండు ప్యాసివ్, రెండు యాక్టివ్ డ్రైవర్లుగా పని చేస్తాయి. .బ్లూటుత్ , వైపై మొదలగు స్మార్ట్ కనెక్షన్స్ ఇందులో ఉన్నాయి.

ఈ టీవీ ధర..

షావోమీ టీవీ ఈఎస్ ప్రో 86 ఇంచుల స్మార్ట్ టీవీ ధర చైనాలో 8,499 యువాన్లు (సుమారు రూ.98,900)గా ఉంది. ప్రస్తుతం చైనాలో ప్రీబుకింగ్స్ మొదలుకాగా, మే 31న సేల్‌కు అందుబాటులోకి వస్తుంది..ఇండియా తో పాటు మిగిలిన దేశాలలో విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...