మన శరీరంలో మనకు నచ్చనది బెల్లీ ఫ్యాట్..బెల్లీ ఫ్యాట్ ఉంది అంటే..ఏ డ్రస్ లో కూడా అందంగా ఉండం. దీనిని వదిలించుకోవటం చాలా కష్టమైన పనే. చాలా కష్టమైన వర్క్ అవుట్స్ చేయాలి. ఏవేవో టీలు తాగాలి. ప్రత్యేకమైన డైట్ మెయింటేన్ చేయాలి. వామ్మో ఇదంతా పెద్ద పంచాయతీ. అసలు చూస్తూ చూస్తూ మనకు ఎందుకు అంత బెల్లీ ఫ్యాట్ ఫామ్ అవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా..ఈరోజు ఈ సమస్యకు కారణాలేంటో చూద్దాం.
1.ట్రాన్స్ ఫ్యాట్
ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా చెడ్డ కొవ్వు. బెల్లీ ఫ్యాట్‌కి ఇదే ప్రధాన కారణం. ఇది మొత్తం శరీర బరువును పెంచేస్తుందట. తద్వారా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేస్తుంది. కాల్చిన, ప్యాక్ చేసిన ఆహారాలలో ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నట్లైతే తగ్గించేందుకు ప్రయత్నించండి.
2. శ్రమ లేకపోవడం..
గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. శారీరక శ్రమ చేయకపోతే బెల్లీఫ్యాట్ కరగడం అసాధ్యం. రెగ్యులర్ వ్యాయామం వల్ల ఫిట్‌గా ఉంటారు. వర్కవుట్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ నెమ్మదిగా కరిగించుకోవచ్చు. కాబట్టి రోజు కనీసం పదిహేను నిమిషాలైనా వ్యాయామం చేయటం అలవాటుగా చేసుకోండి.
3. ఆల్కహాల్
ఆల్కహాల్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఆల్కహాల్‌లో అధిక కేలరీలు ఉంటాయి. ఎటువంటి పోషకాలు ఉండవు. పోషకాలు ఎవరికి కావాలి..అది ఇచ్చే కిక్కు చాలు అనుకుంటున్నారా..తాగినప్పుడు బానే ఉంటుంది..కానీ ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. బరువు విపరీతంగా పెరుగుతారు. అందుకే మద్యం ఎక్కువగా తాగకూడదు.
4. ఒత్తిడి
సరైన నిద్ర లేకపోవడం ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. తక్కువ నిద్ర కూడా కార్టిసాల్‌ను పెంచుతుంది కాబట్టి సరిపడా నిద్ర మనకు చాలా అవసరం.
5 చక్కెర ఆహారాలు
ఆహారపు అలవాట్లు కూడా బరువును ప్రభావితం చేస్తాయి. ఎక్కువ చక్కెరను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. స్వీట్ ఐటమ్స్, పానీయాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలను బర్న్ చేయడం చాలా కష్టం. అవి చివరికి కొవ్వుగా నిల్వ అవుతాయి. అందుకే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది.
ఈ కారణాలు వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందట. కాబట్టి మీ ఫ్యాట్ కి వీటిల్లో ఏది కారణమో చూసుకుని వాటిని తగ్గించేందుకు ప్రయత్నించండి. బెల్లి ఫ్యాట్ అందానికే ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిదికాదు.