వైద్యుల నిర్లక్ష్యం.. నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ..!!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ సోకింది. రక్తమార్పిడి చేసిన తర్వాత వీరిని హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఆ నలుగురు చిన్నారుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హెచ్ఐవీ
హెచ్ఐవీ

రాష్ట్ర ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధాకటే తెలిపిన వివరాల ప్రకారం.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించామన్నారు. ఆ రక్తం ద్వారా చిన్నారులకు హెచ్ఐవీ సోకిందన్నారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఒకరు మృతి చెందారని పేర్కొన్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.