వివేకా-కోడికత్తి..రెండు తెలినట్లే..వైసీపీకి దెబ్బ తప్పదా?

-

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు…టీడీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి..చాలా అంశాలు ప్రభావితం చేశాయి. అయితే వాటిల్లో రెండు కీలకమైనవి ఉన్నాయి..అవి ఏంటంటే..వైఎస్ వివేకా హత్య కేసు..జగన్ కోడి కత్తి కేసు. మొదట వివేకా హత్య కేసు..ఆయన్ని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే..మొదట గుండెపోటు అన్నారని, ఆ తర్వాత చంద్రబాబు చంపించారని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారని, ఇక వైసీపీ మీడియా నారసుర రక్తచరిత్ర అంటూ కథనాలు ఇచ్చిందని..దీన్ని ప్రజలు నమ్మారని అందుకే వైసీపీకి అనుకూలంగా టి‌డి‌పికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.

కానీ ఇప్పుడు ఆ హత్య ఎవరో చేశారో తేలిందని…సొంత వాళ్లే ఆయనని హతమార్చారని తేలిపోయిందని, ఇక మొదట బాబు చంపించారని, ఇప్పుడు ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉందని, మళ్ళీ ఆస్తి తగాదాలు అని అనేక రకాల కారణాలు వైసీపీ వాళ్లే చెబుతున్నారని, కానీ ఎన్ని చెప్పిన ప్రజలకు నిజం ఏంటో అర్ధమైందని..ఈ అంశమే ఇప్పుడు వైసీపీకి పెద్ద మైనస్ అంటున్నారు.

ఇక 2019లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీను అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసి భుజాన్ని గాయపర్చిన విషయం తెలిసిందే. జగన్ ని చంపించడానికే ఇది చంద్రబాబు చేయించిన పని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. దీన్ని ప్రజలు నమ్మారు. కానీ  జగన్‌పై వైజాగ్‌లో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణంలేదని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని,  నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తేలిందని పేర్కొంది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. మొత్తానికి టి‌డి‌పిని దెబ్బతీసిన ఈ రెండు కేసులు ఇప్పుడు ఏం జరిగిందో జనాలకు తెలిసింది..మరి ఇప్పుడు ఇవే వైసీపీకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news