లోకేశ్ టూర్ సక్సెస్ కి వైసీపీ మంత్రులే హెల్ప్ అయ్యారా…?

-

ఏపీ టిడిపిలో లోకేష్ పర్యటనలు ఉత్సాహం నింపాయా….మంత్రుల అంతగా రియాక్ట్ అవ్వడం చినబాబు టూర్లకు కలిసివచ్చిందా…ప్రస్థుతం టీడీపీలో ఈ అంశం పైనే చర్చ జరుగుతుంది.కారోనా కారణంగా అటు చంద్రబాబు…ఇటు లోకేష్ హైదరాబాద్ కే పరిమితం అవ్వడంపై అనేక విమర్శలు వచ్చాయి. అటు అధికార పార్టీ నుంచే కాకుండా సొంత పార్టీలో కూడా దీనిపై చర్చ జరిగింది. అధినేత చంద్రబాబు ఇంటికే పరిమితం అవ్వడాన్ని పార్టీలో ఎవరూ తప్పు పట్టలేదు. అయితే లోకేష్ అయినా రాష్ట్రంలో పర్యటించాలి అనే డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది.

కరోనా కారణంగా 6 నెలలుగా ఇంటికే పరిమితం అయిన లోకేష్…వరదలు, వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. 5 జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో కలియ దిరిగిన లోకేష్ రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది అని ఆరా తీశారు. ప్రధాని అడిగే వరకు సిఎం పర్యటను కూడా రాలేదు అంటూ ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు. అప్పటి వరకు పార్టీ వ్యవహారా ల పట్ల స్థబ్దుగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా టూర్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాను అనుకున్నట్లు లోకేష్ టూర్లు చర్చ కావడానికి ప్రభుత్వం పరోక్షంగా సహకరించింది అంటున్నారు టిడిపి నేతలు.

లోకేష్ టూర్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వంలో మంత్రులు, అధికార పార్టీ ముఖ్యనేతలు విమర్శలు కురిపించారు. ఘాటు వ్యాఖ్యలతో ఇప్పుడెందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. దీంతో సాదా సీదా గా సాగుతున్న పరామర్శ పర్యటనలు కూడా చర్చకు కారణం అయ్యాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, కీలక నేతలు టూర్ పై మాట్లాడడం వల్లనే తమ నేత పర్యటనకు మరింత గుర్తింపు వచ్చిందని పార్టీ నేతలు చెపుతున్నారు. లోకేష్‌ పర్యటనలను అంత సీరియస్ గా తీసుకోకుండా ఉండి ఉంటే…..అవి పార్టీలో, పబ్లిక్ లో రిజిస్టర్ అయ్యేవి కావని నేతలు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news