అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గీతం ఆక్రమణలో ఉన్న 40 ఎకరాల ప్రభుత్వ భూమి ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని పాలసీగా మేము తీసుకున్నాం అన్నారు. దీనిని కక్ష సాధింపు చర్యలా బాబు, లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడడం దారుణం అన్నారు. కోర్టు ఆర్డర్ ని కూడా వక్రీకరించి.. ప్రభుత్వం చర్య దుర్మార్గం అన్నట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.
ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు ఎక్కడా వారు పిటీషన్ లో పేర్కొనలేదు అని ఆయన తెలిపారు. అప్పనంగా ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూస్తున్నారు అని విమర్శించారు. మీ పిటిషన్ పై..కోర్ట్ ఏమి వ్యాఖ్యానించిందో చెప్పాలని డిమాండ్ చేసారు. గీతం అక్రమణలో ఉన్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుతాం అన్నారు. మా వారి మీద కూడా భూఅక్రమణలు ఉన్నాయని టిడిపి నేతలు అంటున్నారు..వెంటనే వాటిని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. బాబు ఒక అవినీతి విశ్వవిద్యాలయం కడుతున్నారని, గీతంకు హక్కు ఉన్న భవనాలను మేము ఎందుకు కొడతాం అని ఆయన ప్రశ్నించారు