బ్రేకింగ్: జడ్జి ముందు రఘురామ

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. గుంటూరులో ఆరో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందు ఆయనను హాజరు పరిచారు సి ఐ డీ పోలీసులు. ఇక ఆయన బెయిల్ పిటీషన్ ని నేడు మధ్యాహ్నం హైకోర్ట్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి పరిణామాలు అన్నీ వేగంగా మారిపోతున్నాయి. ఈ విషయంలో కింది స్థాయి కోర్ట్ లో అప్పీల్ చేసుకోవాలని హైకోర్ట్ ఆదేశం ఇచ్చింది.

ఇక రఘురామ అంశానికి సంబంధించి మరికొంతమందిని కూడా ఎఫ్ ఐ ఆర్ లో సిఐడీ అధికారులు చేర్చారు. వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రెండు ప్రముఖ చానల్స్ కి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని  కథనాలు వస్తున్నాయి.