MP ఇంట్లో తలదాచుకున్న లోకేశ్‌కి నోటీసులు: YCP

-

నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీసులివ్వడంపై వైసీపీ స్పందించింది. ‘అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో అన్నీ తానై నడిపించిన నారా లోకేశ్‌కి ఈరోజు AP CID అధికారులు నోటీసులిచ్చారు. ఈ స్కాంలో A14గా ఉన్న లోకేశ్.. అరెస్ట్ భయంతో గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో దాగుడుమూతలు ఆడుతున్నాడు. MP గల్లా జయదేవ్ ఇంట్లో తలదాచుకున్న లోకేశ్‌కి నోటీసులిచ్చి అక్టోబర్‌ 4న విచారణకు రావాలని ఆదేశించారు’ అని YCP ట్వీట్ చేసింది. అయితే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు.

Nara Lokesh: అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు ఆదేశం | high  court on lokesh bail petition

ఢిల్లీలోని ఎంపీ గల్లాజయదేవ్ ఇంట్లో ఉన్న ఆయనకు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ నోటీసులు తీసుకున్నారని చెప్పారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు రావాలని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ14 గా ఉన్న లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు కొట్టేసింది. అయితే లోకేష్ కు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని అక్టోబర్ 4 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొన్ని రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news