చొప్పదండిపై కాంగ్రెస్-కమలం పట్టు..కారుకు చెక్ పడుతుందా?

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం..ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉన్న ఇక్కడ మొదట్లో టీడీపీ..ఇప్పుడు బీఆర్ఎస్ హవా నడుస్తుంది. 1985 నుంచి ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. 1985, 1989, 1994 ఎన్నికల్లో టి‌డి‌పి గెలవగా, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. ఇలా టి‌డి‌పి ఐదు సార్లు గెలిచింది. ఇక తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అక్కడ బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తుంది.

2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. 2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి బోడిగ శోభ విజయం సాధించారు. అయితే ఆమెపై వ్యతిరేకత రావడంతో 2018 ఎన్నికల్లో కే‌సి‌ఆర్ సీటు ఇవ్వలేదు. సుంకే రవి శంకర్‌కు సీటు ఇచ్చారు. దీంతో శోభ బి‌జే‌పిలోకి జంప్ చేశారు. అయినా సరే ఇక్కడ బి‌ఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేకపోయారు. దాదాపు 42 వేల ఓట్ల భారీ మెజారిటీతో సుంకే విజయం సాధించారు. ఇటు బి‌జే‌పి నుంచి పోటీ చేసి శోభ డిపాజిట్ కోల్పోయారు.

ఇక ఎమ్మెల్యేగా ఇప్పుడు సుంకే దూసుకెళుతున్నారు..వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే పోటీ చేయవచ్చు. ఇటు కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం బరిలో దిగడం ఖాయమే. అలాగే బి‌జే‌పి నుంచి శోభ పోటీ చేయనున్నారు. అయితే గత ఎన్నికలు మాదిరిగా ఈ సారి సుంకే గెలవడం ఈజీ కాదు. పైగా ఆయన పై కాస్త వ్యతిరేకత కూడా ఉంది. ఎస్సై, సీఐ పోస్టుల పేరుతో రవిశంకర్ లక్షల్లో వసూలు చేశాడని,  రవిశంకర్ జాతీయ రహదారుల వెంబడి కోట్ల విలువైన స్థలాలు కొన్నారని, నారాయణపూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ముంపు బాధితులను ఆదుకోలేదని, పదవులు ఇప్పిస్తానంటూ సొంత పార్టీ నేతల దగ్గరే లక్షలు వసూలు చేశాడని, ఆఖరికి కూతురి పెళ్లి చేస్తూ సర్పంచులు, ఎంపీటీసీల నుంచి డబ్బు వసూలు చేశాడని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇవి ఎమ్మెల్యేకు మైనస్ గా ఉన్నాయి.

కాకపోతే అనుకున్న మేర కాంగ్రెస్ బలపడలేదు.  అటు బి‌జే‌పి బలం పెంచుకుంటుంది..కానీ పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేని పరిస్తితి. మొత్తానికైతే చొప్పదండిలో ఈ సారి త్రిముఖ పోరు జరిగేలా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news