వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ అనే అంశంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐదేండ్లే ఉంటారని చెప్పారు. జీవితకాలం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు జగన్ తిరస్కరించారని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరూ శాశ్వతంగా ఉండరని, దీనిపై ప్రజలకు మీడియా ద్వారా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి జగన్ ఉంటారని స్పష్టం చేశారు సజ్జల. నిజానికి పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని స్వీకరించడం జగన్‌కు సుతారమూ ఇష్టం లేదని, అందుకే ఆ పదవిని చేపట్టేందుకు జగన్ తిరస్కరించారని చెప్పారు సజ్జల.
అందుకే శాశ్వత అధ్యక్షుడి అంశం ప్లీనరీ మినిట్స్‌లోకి ఎక్కలేదని తెలిపారు. అందువల్ల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఎవరూ లేరని సజ్జల పేర్కొన్నారు. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా అంగీకరించకపోవడంతో ఆయన ఐదేండ్ల కాలానికి మాత్రమే ఆ పదవిలో ఉంటారని, ఆ తర్వాత తిరిగి ఎన్నిక జరుగుతుందని చెప్పారు సజ్జల. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్లు వెల్లడించారు సజ్జల. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన మాట వాస్తవమేనని, అందుకు సంబంధించి వివరణను కమిషన్ కు పంపామని తెలిపారు సజ్జల.