ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇదో పెద్ద ప్రశ్నగా మారిపోయింది. కొవ్వు తీసుకోవడం వల్లే బరువు పెరుగుతున్నాం అనుకుంటున్నారు. ఆహారంలో కొవ్వుని పూర్తిగా మానేస్తే బరువు పెరగకుండా ఉండి గుండె సంబంధిత వ్యాధుల నుమ్డి దూరంగా ఉండవచ్చని, అందువల్ల ఆహారంలో కొవ్వు లేకుండా చూసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఐతే ఇది నిజంగా నిజమేనా? కొవ్వు అస్సలు మంచిది కాదా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ఆహారంలో కొవ్వు తీసుకోకపోవడం అస్సలు మంచిది కాదు. మన శరీరానికి కొవ్వు కావాలి. కొవ్వుల్లోనూ మంచి కొవ్వు, చెడు కొవ్వు అని ఉంటుంది. మంచి కొవ్వు మన శరీరానికి చాలా అవసరం. మనకి శక్తి రావడానికి కొవ్వు చాలా ఉపయోగపడుతుంది. అసలు ఏది మంచి కొవ్వో, ఏది చెడు కొవ్వో ఎలా తెలుసుకోవాలి? అదీగాక ఎంతశాతం కొవ్వుని తీసుకుంటే మంచి జరుగుతుంది?
బయట భోజనాలు, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మొదలగు వాటిల్లో చెడు కొవ్వు ఉంటుంది. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. రిఫైన్ చేసిన పదార్థాలని తీసుకోవడం ఎన్నో దీర్ఘకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. మరి మంచి కొవ్వు దేనిలో ఉంటుంది?
ప్రకృతి పరంగా వచ్చే ఆహారాల్లో మంచి కొవ్వు ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాల్మన్ చేప. ప్రకృతి పరంగా వచ్చిన ఏ ఆహారంలోనైనా మంచి కొవ్వే ఉంటుంది. ఈ కొవ్వు రక్తపోటుని తగ్గిస్తుంది కూడా.
మనం తీసుకునే కేలరీల్లో 20శాతం కొవ్వు నుండే వస్తుంది. ఈ కొవ్వు చర్మం, జుట్టు మొదలగు సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. అందుకే కొవ్వుని పూర్తిగా మానేయకుండా ఆరోగ్యకరమైన కొవ్వుని ఆహారంగా తీసుకోవడం మంచిది.