మీరు విజయం సాధించాలి అనుకున్నా సాధించలేకపోతున్నారా..? అయితే ఇది మీ కోసం..!

-

సాధారణంగా ఓటమి-గెలుపు వస్తూనే ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. అయితే చాలా మందిలో ఎన్ని సార్లు గెలుద్దాం అన్నా ఓటమిపాలై పోతూ ఉంటారు. గెలవాలి అంటే ఏం చేయాలి…? గెలవాలంటే ఎటువంటి మార్గాలను అనుసరించాలి…? ఏ విధంగా నడుచుకుంటే గెలుపు మన సొంతమవుతుంది..? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యం ఎందుకు ఎందుకోసం పూర్తిగా చూసేయండి.

గెలవాలనే తాపత్రయం:

ఓటమి ఎదురవకుండా మీరు గెలుపొందాలంటే గెలవాలనే తాపత్రయము మీలో ఎక్కువగా ఉండాలి. మీ లోపల ఏదో ఒకటి గట్టిగా అనుకోక పోతే అది జరగదు. మీ తాపత్రయం చాలా ఎక్కువగా ఉండాలి.. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా గెలుస్తాను అని బలంగా అనుకుని దాని కోసం ఆలోచించి.. దాని కోసం పరితపిస్తూ ఉంటారో అప్పుడు తప్పకుండా మీరు గెలుస్తారు.

నేర్చుకోవడం:

ప్రతి దానికి కూడా మీరు కొంత హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఎందుకు కష్టపడాలి గెలుపు నా సొంతం అవుతుందిలే అని తప్పుగా ఆలోచించకూడదు.

ప్రిపరేషన్:

గట్టిగా ప్రిపరేషన్ జరిగితేనే మీరు మంచి ప్లేస్ గెలుచుకో గలరు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రిపరేషన్ అనేది చాలా బాగుండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా..! అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ఆఖరి వరకు ముందుకు వెళ్లాలి. మధ్యలో ఏవైనా చిన్న చిన్న కారణాల వల్ల మీ దృష్టిని మళ్లించి కోకండి. గెలుపు మీదే అని మీరు పూర్తి నమ్మకం పెట్టండి. అలా చేస్తే వీరు తప్పకుండా గెలవగలరు.

Read more RELATED
Recommended to you

Latest news