Breaking : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో శివకుమార్‌కు నోటీసులు

-

మరోమారు కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి ఈడీ కార్యాలయంలో విచారణ హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ.. ఇప్పుడు మరోసారి డీకే శివకుమార్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే.. గత సెప్టెంబర్‌లో సైతం డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే తన రాజ్యాంగ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు సమయం అడ్డు వస్తోందన్నారు శివకుమార్‌.

Left Bharat Jodo Yatra to appear before ED: DK Shivakumar reaches Delhi -  India Today

గతంలో.. విధులు నిర్వర్తించకుండా తనను ఈడీ వేధిస్తోందంటూ శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. కర్నాటకలో బీజేపీ అవినీతిని నిరసిస్తూ ‘40శాతం సర్కారా.. బీజేపీ అంటే భ్రష్టచార’ పేరుతో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్‌ గాంధీని సైతం ఈడీ విచారించింది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news