నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికుడి ఇంట్లో ప్రియురాలు పినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఏడాది నుంచి ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణ గీత్ మోసం చేశాడు. ఈ విషయం తెలియక తమ అమ్మాయికి మరో పెళ్లి పేరెంట్స్ చేశారు. ప్రియురాలి రెండో పెళ్లి జరిగిన రెండు రోజులకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు కృష్ణ గీత్. అసలు విషయం తెలిసి మోసం చేసిన యువ అధికారి ఇంట్లో తమ కూతురును వదిలి వెళ్లారు కుటుంబ సభ్యులు.
ఈ నేపథ్యం లోనే ప్రేమికుడు కృష్ణ గీత్ ఇంట్లో ఆ అమ్మాయి పినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. దీంతో అక్కడే ఉన్నవారు గమనించి.. వెంటనే ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణ గీత్ కోసం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.