ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది సెలబ్రిటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక సోనూసూద్ లాంటి వాళ్లయితే నిరంతరం ఇలాంటి సేవల్లోనే ఉంటున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తనవంతు సాయం ప్రకటించాడు.
ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలు తమవంతు సాయం చేస్తున్నారు. ఓ హీరో అయితే తనకిష్టమైన బైక్ ను అమ్మి మరీ డబ్బులు సాయం చేశాడు. ఇక టీలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా సమాచారాన్ని అందిస్తూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా ముందుకొచ్చాడు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోతున్న అనాథ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించాడు. రెండేళ్ల వరకు వారికి కావాల్సిన తిండి, చదువు, ఇతర విషయాలను తానే చూసుకుంటానని చెప్పాడు. అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని కోరాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను..sundeepkishancovidhelp@gamil.com కు పంపాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో అంతా సందీప్ కిషన్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు.