టెన్నిస్ కోర్టులో యువతి హల్‌చల్.. నెట్ తాడుతో ఉరేసుకుని నిరసన..!!

-

ప్రస్తుతం పారిస్‌లో ‘ఫ్రెంచ్ ఓపెన్’ సెమీ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ సెమీ ఫైనల్స్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి టెన్నిస్ కోర్టులో ప్రవేశించి.. నెట్ తాడును మెడకు చుట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ యువతి వాతావరణ కార్యకర్త. మ్యాచ్ వీక్షించేందుకు టికెట్ తీసుకుని లోపలికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదు.. మ్యాచ్ ప్రారంభమైతుందని తెలిసి ప్రేక్షకులను తోసుకుంటూ కోర్టులోకి ప్రవేశించింది.

వాతావరణ కార్యకర్త
వాతావరణ కార్యకర్త

నెట్ దగ్గరికి చేరుకుని మోకాలిపై కూర్చొని, మెడకు తాడు వేసుకుని మౌన నిరసన దీక్ష చేపట్టింది. అయితే ఆమె ధరించిన టీషర్ట్ మీద ‘మాకు 1028 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.’ అని రాసి ఉంది. కొద్ది సేపటి తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లారు. అయితే మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు క్యాస్పర్ రూడ్, మారిన్ సిలిక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. వీరిద్దరి మధ్య శుక్రవారం ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్యాస్పర్ రూడ్ విజయం సాధించాడు. కాగా, వాతావరణ కార్యకర్త ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అసలెందుకు ఆమె మౌనదీక్ష చేపట్టిందనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

https://twitter.com/doublefault28/status/1532803315444158465

Read more RELATED
Recommended to you

Latest news