మీ వంటగదే ఓ వైద్యాలయం..ఎలా అంటే.?

-

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి భారతీయ వంట గదిలో దొరికే ఎన్నో ఔషధాలు ఆరోగ్య ప్రయోజనాన్ని కలుగచేస్తాయని బహుశా చాలామందికి తెలియదని చెప్పాలి. అందుకే ప్రతి చిన్న దానికి కూడా ఇంగ్లీష్ మందుల వెంట పరిగెడుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఔషధమూలికలతో మీరు చికిత్స చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దరిచేరవు. ఇకపోతే మీ వంటగది ఒక వైద్యాలయం అని చెప్పడానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మేము మీకు ఇప్పుడు చూపించబోతున్నాం.

ముఖ్యంగా నొప్పి అనేది శరీరంలో దాదాపు అన్ని భాగాలను ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక మన శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి వస్తే ఆ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది పెయిన్ కిల్లర్ మాత్రలను తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే వీటి వల్ల త్వరగా ఉపశమనం కలిగినప్పటికీ దీర్ఘకాలంకంగా దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. కానీ మీ వంటగదిలోని సహజమైన పెయిన్ కిల్లర్స్ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. వీటిని ఉపయోగించి మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..

ముఖ్యంగా వాటిలో పసుపు కూడా ఒకటి.. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంపై చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పసుపును పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా నోటిలో బొబ్బలు ఉంటే ప్రభావిత ప్రాంతాలలో నీరు, కొబ్బరి నూనెతో కలిపిన పసుపు ముద్దను పూస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇక కాలిన చర్మం పై గాయాలను మాన్పడానికి కూడా పసుపు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇక అలాగే ఫ్లూ వల్ల వచ్చే దురదల్ని కూడా పసుపుతో తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news