ఏప్రిల్ నెలాఖరులోగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు సిబిఐ ని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేసింది సిబిఐ. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు నేడు ఉదయం పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు మెమో అందజేసి 120 బి, రెడ్ విత్ 302, టు జీరో వన్ సెక్షన్ల కింద ఆయనని అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కి తరలించిన సిబిఐ అధికారులు.. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరు పరిచారు. అనంతరం భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనని సిబిఐ అధికారులు చంచల్గూడా జైలుకి తరలించారు.