మర్కజ్ మసీదు ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లిన వారివే కావటంతో అధికార నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న స్టార్టింగ్ టైములో ఎక్కువగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారి వల్ల వ్యాప్తి చెందుతుందని గుర్తించడం జరిగింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వాళ్లని ఇంటికే పరిమితం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకంటే ముందు జగన్ ప్రభుత్వం ఉంది.గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. దీంతో చాలా వరకు 21 కేసులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి టైములో పరిస్థితి అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా పాజిటివ్ రిపోర్టులు దేశవ్యాప్తంగా రావటంతో ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఈ పరిణామంతో సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి చోటా కరోనా పరీక్షలు నిర్వహించేలా ల్యాబ్ లు ఏర్పాటు చేసి… చాలావరకు ఐసోలేషన్ పడక గదులను కొన్ని వందల సంఖ్యలో ప్రతి నియోజకవర్గం లో ఉండేలా చూసుకున్నారు.ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా నియమించారు. ఒకపక్క గ్రామ వాలంటీర్లు ఆశావర్కర్ల తో పని చేపిస్తూ మరో పక్క జిల్లా కలెక్టర్లను ఎప్పటికప్పుడు ఐసోలేషన్ వార్డులో పరిస్థితి తెలుసుకొని తనకి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించడం జరిగింది. ఇదే తరుణం లో ప్రతి మంత్రికి కొన్ని జిల్లాలను అప్పగిస్తూ అధికారులు ఏ విధంగా పని చేస్తున్నారో పరీక్షించాలని బాధ్యతలు జగన్ అప్పగించటం జరిగింది. ఇటువంటి క్లిష్ట టైములో కృష్ణా జిల్లా మంత్రి పేర్ని నాని…సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు ఇటీవల నమోదు కావడంతో దానిని రెడ్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.దీంతో వెంటనే అలెర్ట్ అయి ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ మరియు ఆశా వర్కర్ తో మంత్రి పేర్ని నాని వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతూ ఎవరూ భయపడవద్దని గడపగడపకు వెళ్లి చెప్పడం జరిగింది. అంతే కాకుండా అందరి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవటం జరిగింది. నిత్యవసర వస్తువులు అదేవిధంగా కూరగాయలు ఇంటికే వస్తాయని ఎవరు బయటికి రాకూడదని ప్రజలకు సూచించారు. దీంతో మచిలీపట్నం ప్రజలంతా పేర్ని నాని తమ పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో ప్రజలు కాస్తా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
ఎందుకంటే ఓట్ల సమయంలో మినహా మిగిలిన సమయాల్లో రాజకీయ నేతలు తమ గడప తొక్కరనే అభిప్రాయంలో జనం ఉన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ వ్యవస్థలో పేర్నినాని వాళ్లకు భిన్నంగా వ్యవహరించడంతో మచిలీపట్నం వాసులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ పార్టీలో హాట్ టాపిక్ అవటంతో… ఇటువంటి టైములో అన్నా నువ్వు నియోజకవర్గం ప్రజలపట్ల మంచిగా ప్రతిస్పందించారు అంటూ సహచరులు అభినందించారు. ఇదే టైమ్ లో మంచి బిజీగా ఉన్న జగన్ కూడా పేర్ని నాని కి ఫోన్ చేసి ‘అన్నా నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ అభినందించినట్లు వైసీపీ పార్టీలో టాక్.