వైసీపీ పార్టీలో జగన్ తర్వాత స్థానం ఎవరిది అని ఆ పార్టీలో ఉన్న సీనియర్స్ ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు చెబుతారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి లేనిదే జగన్ లేరని చాలామంది జగన్ కుటుంబం గురించి తెలిసినవారు అలాగే జగన్ యొక్క ఆలోచన గురించి తెలిసిన వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. అటువంటి విజయసాయి రెడ్డి సమక్షంలో రాజకీయ వ్యూహాలు వేస్తూ గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు జగన్. దాదాపు సార్వత్రిక ఎన్నికల టైంలో బలమైన క్యాడర్ కి చెందిన నాయకులను వైసీపీ పార్టీలోకి తీసుకు రావడంలో ప్రధాన భూమిక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయి పది నెలలు కావస్తున్నా టైం లో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారు.
ముఖ్యంగా పరిపాలన రాజధానిగా గుర్తించిన విశాఖపట్టణంలో విశాఖ మేయర్ స్థానాన్ని వైసిపి పార్టీ గెలవాలని గట్టిగా విజయసాయిరెడ్డికి జగన్ సూచించారట. అయితే విశాఖ పట్టణం నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండటంతో విజయసాయి రెడ్డి పొలిటికల్ కెరియర్ కే జివిఎంసి ఎన్నికలు అతి పెద్ద చాలెంజ్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.