అధికారపార్టీ ఏమిచేసినా తప్పే.. ఇది ప్రతిపక్ష పార్టీల ప్రాథమిక సూత్రం! ఈ విషయంలో మరోసారి మైకులముందుకు వచ్చారు టీడీపీ నేతలు. ఎందుకయ్యా అంటే… జగన్ సర్కార్ వినాయకచవితిని జరుపుకోనివ్వడంలేదని అంట! గతకొంతకాలంగా ఏపీలో అధికారపక్షాన్ని న్యాయస్థానాలనుంచి మరీ ఎదుర్కోంటున్న టీడీపీ నేతలు తాజాగా ఇదే వ్యవహారంపై జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
అవును… ఏపీ టీడీపీ నేతలు పండగల గురించి తెగ ఫీలైపోతున్నారు. ఒకపక్క కోవిడ్ థర్డ్ వేవ్ అనే టెన్షన్ తో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు కోర్టు కూడా.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పండగ జరుపుకోవాలని, ఉత్సవాలు చేసుకోవాలని తెలిపింది. ఈ విషయలో పబ్లిక్ స్థలాల్లో ఎటువంటి ఉత్సవాలూ చేయొద్దని చెప్పింది. అయితే ఈ విషయం టీడీపీ నేతలు మరిచారో ఏమో కానీ… జగన్ నుంచి క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు!
ఏపీ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధల పండుగను జరుపుకుంటుంటే.. ఏపీ సర్కార్ అడ్డుచెబుతుందని మొదలుపెట్టారు అచ్చెన్నాయుడు. ఫలితంగా… భక్తులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత ప్రతిపక్షమైతే మాత్రం… సర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమేనా? ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ఇంగితం ఎంతో కొంత ఉండాలి కదా!
విచిత్రం ఏమిటంటే… పుష్కరాల పేరుచెప్పి భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు వ్యవహారాని మరిచినట్లున్నారు టీడీపీ నేతలు. నాడు.. షూటింగుల మోజులో పడిన చంద్రబాబు, భక్తి పారవశ్యంతో నిండిపోవాల్సిన గోదావరి మహా పుష్కరాల ప్రాంతాన్ని అత్యంత దయనీయంగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా నాడు రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 36మంది మృతి చెందారు!
నాడు భక్తులకు చంద్రబాబు చెప్పాలి క్షమాపణలు. కానీ… ఆ దారుణానికి సంబందించి బాబు, భక్తులకు క్షమాపణలు చెప్పిందీ లేదు.. బాధ్యులపై చర్యలు తీసుకున్నదీ లేదు! కానీ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని జగన్ అంటే మాత్రం… భక్తులకు క్షమాపణలు చెప్పాలంట!! ఇందుకు కాదా అచ్చెన్నా… 2019 ఎన్నికల్లో ఫలితాలు అలా వచ్చింది!
ప్రతిపక్షంలో ఉన్నంతమాత్రాన్న ప్రజాక్షేమం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? ప్రజల మనోభావాలు ఎంత ముఖ్యమో.. వారి క్షేమం చూడాటం అధికార – ప్రతిపక్షాలకు అంతే ముఖ్యం కదా! అది మరిచి.. జనం అడగడంలేదు కదా అని అడ్డంగా ఆలోచిస్తే ఎలా అచ్చెన్నా?
-CH Raja